32.8 C
India
Tuesday, April 30, 2024
More

    Greenery In Desert : ఔను ఎడారిలో పచ్చదనం.. ఒంటెల్లో ఆనందం

    Date:

     

    Greenery In Desert
    Greenery In Desert

    Greenery In Desert : ఎడారి అంటే ఇసుక బయళ్లు. ఎటుచూసినా ఇసుక మేటలే కనిపిస్తాయి.ఎడారిలో తాగడానికి నీరు కూడా కరువే. చూద్దామంటే గడ్డి పరక కూడా కనిపించదు.ఒంటెలకు మేత కూడా కరువే. గుక్కెడు నీళ్ల కోసం మైళ్ళ దూరం వెళ్లాల్సిందే.  పచ్చదనం అంటే ఎలా ఉంటది అనేది ఎడారి ప్రాంతాల ప్రజలకు పెద్ద ప్రశ్న.

    ఏడారి ప్రాంతాల్లో అతి పెద్ద సమస్య తాగునీరు. ఇక్కడ సరిపడా తాగునీరు దొరికిందంటే వారంతా అదృష్టవంతులు మరొకరు ఉండరేమో. అలా ఉంటుంది అక్కడి పరిస్థితి. ఏడారి ప్రాంతాలను తట్టుకోగలవాటిలో ఒంటెలు ప్రధానమైనవి. ఇవి ఒక్కసారి నీరు తాగాయంటే మళ్లీ 15 రోజుల దాకా నీటి అవసరమే ఉండదు వాటికి.  అందుకే వాటికి ఏడారి నౌక అనే పేరు వచ్చింది. ఇసుక దిబ్బల్లో ఎంత దూరమైనా అలసట అనేది లేకుండా ప్రయాణించగలవు.  ఇప్పుడు అక్కడ ఒంటెలకు తిన్నంత పచ్చ గడ్డి దొరుకుతుంది. ఇసుక దిబ్బలపై గడ్డి మొలవడాన్నీ చూసిన వారు ఒక్కక్కరు ఒక్కో రీతిలో అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.  ఎడారిలో ఇసుక మీద గడ్డి కనిపించడంతో  ప్రపంచం అంతం కాబోవడానికి ఇదిఒక తార్కాణమని  పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

    ఇసుక దిబ్బల్లో పచ్చదనం
    సౌదీలో అరేబియా ఎడారి ప్రాంతం అంటేనే భరించలేనంత వేడి. ఎటు చుసిన ఇసుక దిబ్బలే కనిపిస్తాయి. సౌదీ అరేబియా చూడటానికి వెళ్లిన యాత్రికులు కచ్చితంగా ఎడారి ప్రాంతాన్ని చూసి ఆనందిస్తారు. అటువంటి ప్రాంతం నేడు పచ్చదనంతో నిండిపోవడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు పలువురు యాత్రికులు. కంటికి కనిపించినంత దూరం పచ్చటి గడ్డి కనిపిస్తున్న దృశ్యాన్ని పలువురు వీడియో ద్వారా వైరల్ చేస్తున్నారు. కొందరు సెల్ఫీ తీసుకోని ఆనందపడుతున్నారు.

    ఇన్నాళ్లు ఒంటెలు ఆహారంగా కోసం వెతుకునేవి. ఇప్పుడు వాటికి ఎదురుగానే మేత కనిపించడంతో వాటిలో కూడా ఆనందం వ్యక్తం అవుతోంది. ఒంటెల జీవన విధానంపై ఆధారపడిన కొందరు వాటిని మేపడానికి ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు వారికి కష్టాలు తొలగిపోయాయి.ఎడారిలో ఇసుక దిబ్బలపై పచ్చదనం రావడం తో ఈ అద్భుతమైన సంఘటన చూసిన శాస్త్ర వేత్తలకు కూడా అంతుపట్టడంలేదు. ఎట్టకేలకు ఎడారిలో పచ్చదనం కోసం సౌదీ అరేబియా ప్రభుత్వం,అక్కడి శాస్త్రవేత్తలు,సంబంధిత అధికారులు చేసిన కృషి ఫలించడం తో అక్కడి ప్రజలు ఆనందానికి ఆవదలు లేకుండా పోయింది.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related