Bindu Madhavi బిందు మాధవి.. ఈమె గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.. గతంలో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించింది.. తెలుగులో చాలా మంది హీరోలతో సినిమాలు చేసిన కూడా ఈ భామ క్లిక్ అవ్వలేదు.. హీరోయిన్ గా ఇక్కడ సక్సెస్ కాలేక పోవడంతో ఈమె తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది.
అక్కడ కూడా సినిమాలు చేస్తూ ఉంది.. ఇక ఈమె సినీ కెరీర్ లో సంపాదించుకోలేని స్టార్ డమ్ ఈమెకు బిగ్ బాస్ షో ఇచ్చింది అనే చెప్పాలి. ఎందుకంటే ఈమె తమిళ్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొని అలరించింది. ఇక అక్కడ బిగ్ బాస్ తో ఫేమస్ అయిన తర్వాత మన తెలుగు ఓటిటి బిగ్ బాస్ లో కూడా పాల్గొంది.
ఈ షోతో ఇక్కడ కూడా అలరించిన ఈ బ్యూటీ ఏకంగా విన్నర్ గా నిలిచి ఎంతో మందికి ఫేవరేట్ గా నిలిచింది.. అప్పటి నుండి ఈమెకు ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. ప్రజెంట్ బిందు మాధవి ఓటిటి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది.
ఇదిలా ఉండగా ఈమె తాజాగా నటించిన ఒక వెబ్ సిరీస్ లో భాగంగా ప్రమోషన్స్ లో పాల్గొనగా ఈమెకు షాకింగ్ ప్రశ్న ఎదురైంది. మీరు త్రిష బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తున్నారా అని అడిగారు.. దానికి ఆమె నిర్మొహమాటంగా అవును నేను త్రిషతో విడిపోయిన తర్వాత డేటింగ్ చేశా.. అంటూ షాకింగ్ రివీల్ చేసింది. ఇప్పుడు ఈమె అతడితో రిలేషన్ లో లేదు.. ఇలా డేటింగ్ విషయం అందరి ముందు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.