
YSRTP Merge on Congress : వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని అధినేత శర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ శర్మిల. ఏపీలో ఆమె అన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీటం కూర్చుకున్నాడు. అయితే ఆమెకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో అన్నను విభేదించిన ఆమె తెలంగాణలో ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ)’ పెట్టింది. కొన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడిన శర్మిల పార్టీని మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలమైంది.
ఇక ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్కసీటు మాట దేవుడెరుగు.. కనీసం డిపాజిట్లు దక్కుతాయా అన్న వాదన కూడా బయల్దేరింది. దీంతో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ తో పొత్తుకు తెరలేపారు. వైఎస్ శర్మిల మాత్రం దీనిపై మొదట స్పందించలేదు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లను తీసుకొని గెలవాలని ఆమెకు వారు సూచించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అనంతరం రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్ షర్మిల చేసిన ట్వీట్‌తో తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం రేపాయి.
డీకే శివకుమార్ తో పొత్తుల నేపథ్యంలో తనకు ఒక రాజ్యసభ సీటు కేటాయిస్తే పార్టీని విలీనం చేస్తానని ఆమె చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారు కూడా అందుకు సమ్మతించడంతో షర్మిల పార్టీ స్థాపించి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో కడప జిల్లాలోని ఇడుపులపాయలో జులై 8న విలీనం జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. సోనియాగాంధీ, రాహుల్ జూలై 8న కడపలో పర్యటించి విమాన ప్రమాదంలో మరణించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం గురించి మాట్లాడటం చాలా కీలకం అని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె బెంగళూరులో శివకుమార్‌ను కలిశారని, అయితే అది పూర్తిగా వ్యక్తిగతమని వారు చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌లోని ఒక వర్గం కూడా షర్మిలను చేర్చుకోవడంపై ఉదాసీనంగా ఉంది, ఎందుకంటే ఆమె తండ్రి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినందున అది ప్రతికూలంగా మారుతుందని వారు భావిస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో జగన్, ఆమె కుటుంబం కాంగ్రెస్ నుంచి విడిపోయింది. తండ్రి మృతితో షాక్‌కు గురై ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల, జగన్ తో కలిసి ఓదార్పు యాత్ర చేశారు. అయితే షర్మిల కూడా తన సోదరుడితో విభేదించి 2021లో పార్టీ పెట్టింది.అయితే వారి తల్లి విజయమ్మ కూడా జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి షర్మిలతో చేతులు కలిపారు.