38.3 C
India
Thursday, May 2, 2024
More

    Election Commission : ఎన్నికల కమిషన్ ఎవరికీ చుట్టం ????

    Date:

    Election Commission
    Election Commission

    Election Commission : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కడప అభ్యర్థిగా బరిలో నిలిచారు. షర్మిల మాత్రం తన ప్రచారంలో బాబాయ్ వివేకా హత్యకేసునే ఎంచుకొంది. అవినాష్ రెడ్డి కూడా కడప అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు అవినాష్ రెడ్డిని,మరోవైపీ అన్న జగన్ ను ప్రచారంలో నిలదీయడంతో తలపట్టుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఓటమి ఖాయమని భావించి జగన్ జరుగుతున్న విషయాన్నీ ఎన్నికల కమిషన్ దృష్టి కి తీసుకెళ్లాడు. కమిషన్ స్పందించి ఎవరు కూడా వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకోరాదంటూ ఆదేశాలు జారీచేసింది. కానీ విజయవాడలో జరిగిన రాయి దాడి ని మాత్రం జగన్ అతని భజన పరులు,కుటుంబ సభ్యులు,పార్టీ నాయకులు మీడియా ద్వారా విచ్చల విడిగా ప్రచారం చేసుకుంటూ ఉంటె మాత్రం ఎన్నికల కమిషన్ కు నియమాలు గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

    జగన్ పై దాడి జరిగిన మరుసటి రోజుననే చంద్రబాబుతోపాటు పవన్ కళ్యాణ్,లోకేష్ ల పర్యటనలో కూడా రాళ్లతో దాడి జరిగింది.ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ దాడి రాజకీయ నాటకాలంటూ తోసేశారు. అదే జగన్ రాయి దాడి ని మాత్రం పోలీస్ శాఖ రాజకీయ కుట్రతోనే దాడి జరిగిందంటూ కేసు నమోదు చేశారు. అంతే కాదు ఆసుపత్రికి వెళ్లడం.ఓ పదిమంది వైద్యం చేయడం,దాన్ని కూడా పెద్దగా ప్రచారం చేసుకుంది జగన్ పార్టీ. రాయి దాడిని ఇంకా ఏవిదంగా అనుకూలంగా చేసుకోడానికి ప్రయత్నిచారంటే టిడిపి విజయవాడ అభ్యర్థి బోండా ఉమా రాయి దాడి ప్రధాన కుట్రదారుడని అబద్ధపు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతోంది.

    జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో ఇంకా విచారణ చేయాల్సి ఉందని, కుట్ర వెనుక ఉన్న ప్రధాన పాత్రధారులను బయటకు తీయాల్సి ఉందని, నిందితులు మాట్లాడిన ఫోన్ వివరాలపై కూడా విచారణ చేయాల్సి ఉందని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. వివేకా హత్య కేసు గురించి ఎవరుకూడా మాట్లాడకూడదు అని అంటున్న ఎన్నికల కమిషన్ కు రాయి దాడి గురించి సోషల్ మీడియాతోపాటు సొంత మీడియాలో తెలుగు దేశంపై వ్యతిరేకంగా వస్తున్న వార్తలు కమిషన్ కు వినిపించడంలేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

    అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ఈ కేసు రిమాండ్‌ రిపోర్టులో విషయాలు, కీలకమైన ఎన్నికల సమయంలో సాక్షి మీడియా చేతికి ఎలా వచ్చాయి?అది ఎలా ప్రచురిస్తోంది?ఈ కేసు గురించి మీడియాకు లీకులు ఇస్తున్న పోలీస్ అధికారులు ఎవరు?వారిపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? అని ఈరోజు సాక్షి ఆన్‌లైన్‌ ఎడిషన్‌లో ‘బోండా బ్యాచ్ స్కెచ్… సిఎం జగన్‌ను హత్య చేసేందుకే’ పేరుతో ప్రచురించిన కధనాన్ని చూపిస్తూ టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

    విజయవాడలో జరిగిన రాయి దాడి కేసు విచారణ చేస్తున్న పోలీసులు చాల సీక్రెట్ గ ఉంచాలి. ఎన్నికల సమయం ఆసన్నమైన నేపథ్యంలో ఈ కేసు వివరాలు జగన్ మీడియా సంస్థకు ఎలా చేరుతాయి అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఒక సంస్థకు కేసు వివరాలు వెళుతున్నాయంటే ఎన్నికల కమిషన్ ఏమి చేస్తుంది. ఎందుకు స్పందించడం లేదని కూడా తెలుగు దేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఇంతకు ఎవరికీ చుట్టం అని కూడ టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    AP Liquor : ఓటేసే ముందు వైన్స్ షాపులను చూసి వెళ్లండి..

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల ముందు జగన్...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...