కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్ చానళ్లకు షాక్ ఇచ్చింది. 8 యూట్యూబ్ ఛానళ్లని నిషేధించింది కేంద్రం. ఈ ఎనిమిది యూట్యూబ్ ఛానల్ లలో 7 భారత్ కు చెందినవి కాగా ఒకటి పాకిస్థాన్ కు చెందిన యూట్యూబ్ ఛానల్ కావడం విశేషం. ఈ ఎనిమిది యూట్యూబ్ చానళ్ళు కూడా భారత్ లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో కేంద్రం ఈ చర్యలకు దిగింది. అంతేకాదు ఎనిమిది యూట్యూబ్ ఛానళ్ల లిస్ట్ ని కూడా విడుదల చేసింది. 8 యూట్యూబ్ చానళ్ళు బ్యాన్ కావడంతో సదరు ఛానల్ ఓనర్లు లబోదిబోమంటున్నారు.
Breaking News