
garlic help : ఈ రోజుల్లో అధిక బరువు సమస్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బరువును నియంత్రించుకునే చిట్కాలు ఎన్నో ఉన్నాయి. ఊబకాయం సమస్యతో సతమతమవుతున్నారు. వెల్లుల్లి కూరల్లో వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. బరువును తగ్గించడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో వెల్లుల్లి సాయపడుతుంది. డ్రింక్ తయారు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఆకలి ఎక్కువగా కాకుండా చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వెల్లుల్లిలో ట్రైగ్జిజర్స్ తో పోరాడి గుండె జబ్బుల ముప్పును తొలగిస్తుంది.
వెల్లుల్లిలో విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, మాంగనీసు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లి జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. ఇందులో అల్లిసిన్ అనే పదార్థం చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడుతుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లి రెబ్బలు తింటే ఎంతో మేలు కలుగుతుంది.
వెల్లుల్లి రెబ్బలు ఒలిచినవి తినాలి. గాలిలో ఉంచిన వాటిని తింటే మంచిది కాదు. బరువు తగ్గడానికి వెల్లుల్లితో చేసే డ్రింక్ ఎంతగానో మేలు చేస్తుంది. ఇలా వెల్లుల్లి మనకు చాలా రకాలుగా రక్షణ కలిగిస్తుంది. అందుకే వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.