కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 త్వరలోనే ప్రారంభం కానుంది. అధికారికంగా బిగ్ బాస్ 6 ప్రారంభమయ్యే డేట్ అనౌన్స్ చేశారు. ఇంతకీ బిగ్ బాస్ 6 స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా ……… సెప్టెంబర్ 4 నుండి. అవును సెప్టెంబర్ 4 నుండి బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ కానుంది.
బిగ్ బాస్ తెలుగులో ఇప్పటి వరకు 5 సీజన్ లు రాగా అయిదు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అలాగే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చి పడ్డాయి. అయితే ఎన్ని విమర్శలు వస్తున్నా బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం వెనకడుగు వేయడమే లేదు. మొదటి సీజన్ ని ఎన్టీఆర్ ప్రారంభించగా రెండో సీజన్ ని నాని హోస్ట్ గా వ్యవహరించాడు.
ఇక మిగతా అన్ని షోలను కింగ్ నాగార్జున సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళుతున్నాడు. తాజాగా ఆరో సీజన్ కూడా స్టార్ట్ కాబోతోంది. బిగ్ బాస్ షోపై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ అదే స్థాయిలో ఆదరించే ప్రేక్షకులు కూడా ఉండటం విశేషం. ఇక నాగార్జున కూడా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు ఈ షో కోసం.
Breaking News