
అగ్రరాజ్యం అమెరికాలో ఇండో అమెరికన్ అరుణ్ మజుందార్ కు అరుదైన గౌరవం లభించింది. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నడిచే స్కూల్ కు డీన్ గా అరుణ్ ని నియమించడం విశేషం. 1985 లో బాంబే ఐఐటీ నుండి మెకానికల్ ఇంజీనీరింగ్ లో బ్యాచ్ లర్ డిగ్రీ పట్టా పుచ్చుకున్న అరుణ్ మజుందార్ కోల్ కతా వాసి. అయితే ఆ తర్వాత 1989 లో అమెరికా వెళ్ళాడు. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుండి పిహెచ్ డీ అందుకున్నాడు.
2014 లో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో చేరి వివిధ హోదాల్లో పనిచేసాడు. ఇక ఇప్పటి విషయానికి వస్తే …… మానవ జీవనశైలిలో అనేక మార్పులు వచ్చాయి దాంతో వాతావరణంలో కూడా పలు మార్పులు సంభవించాయి. ఈ మార్పుల వల్ల మానవ మనుగడ ప్రశ్నార్ధకమై పోతున్న ఈ తరుణంలో వాటికి పరిష్కారం చూపించాలనే సాహసం చేస్తోంది స్టాన్ ఫోర్డ్ . అందులో భాగంగానే గ్లోబల్ క్రైసిస్ ని ఎలా ఎదుర్కోవాలో అధ్యయనం చేసే స్కూల్ కు అరుణ్ మజుందార్ ని డీన్ గా నియమించారు. దాంతో తనకు లభించిన గౌరవానికి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు తనపై పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని అంటున్నాడు కూడా.