విదేశీయులకు శుభవార్త తెలిపింది ఆస్ట్రేలియా. వివిధ దేశాలకు చెందిన వాళ్ళు ఆస్ట్రేలియాలో స్థిరపడాలని భావిస్తున్నారు. అయితే అలాంటి వాళ్లకు ఇన్నాళ్లు కరోనా ఆంక్షల కారణంగా వీసాలు మంజూరు కాలేదు. కోవిడ్ ఆంక్షల పేరుతో వీసాలను మంజూరు చేయకపోవడం వల్ల ఆస్ట్రేలియా కూడా ఇబ్బంది పడుతోంది. దాంతో ఆ ఇబ్బందుల నుండి బయట పడటానికి ఇక ఈ ఏడాది ఏకంగా 1,95,000 వీసాలను మంజూరు చేయనుందట. దాంతో ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున స్థిరపడాలని, ఉద్యోగం చేసుకోవాలని ఆశిస్తున్న వాళ్లకు ఇది శుభవార్త అనే చెప్పాలి.
Breaking News