చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా పుట్టినిల్లు అయిన చైనా ఇప్పుడు కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పుడు ఆ దేశంలో దాదాపు 4 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. దాంతో కరోనా బారిన పడిన వాళ్లకు సేవలు అందించలేక అల్లాడిపోతున్నారు వైద్య సిబ్బంది. ఎక్కడ ఆసుపత్రుల్లో చూసినా దయనీయ పరిస్థితి నెలకొంది.
అలాగే మెడికల్ షాపుల ముందు పెద్ద క్యూ ఉంది. అంతేకాదు నిమ్మకాయల కోసం , బత్తాయి , ఆరెంజ్ తదితర పండ్ల కోసం కూడా పెద్ద ఎత్తున జనాలు ఎగబడుతున్నారు. ఇటీవలే చైనాలో కరోనా ఆంక్షలు సడలించిన విషయం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. రాబోయే నెల రోజుల్లో కనీసం 50 కోట్ల మందికి కేవలం చైనాలోనే కరోనా సోకడం ఖాయమని వినిపిస్తోంది. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ BF 7 చైనాను అతలాకుతలం చేస్తోంది.