
ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు అమెరికా , రష్యా , చైనా , యూకే , ఫ్రాన్స్ మాత్రమే. ఈ అయిదు దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వం ఉంది. దాంతో వీటో అధికారం కలిగి ఉన్నాయి. ఇక వాటి తర్వాత మరో 15 దేశాలు సభ్యత్వం మాత్రమే కలిగి ఉన్నాయి. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం చాలా సంవత్సరాలుగా భారత్ పోరాడుతూనే ఉంది.
అయితే చైనాతో పాటుగా అమెరికా మిగతా దేశాలు భారత్ కు అడ్డుగా నిలిచాయి ఇన్నాళ్లు. కానీ కాలక్రమంలో పలు దేశాలు తమ వ్యతిరేకతని కాస్త సడలించాయి. రష్యా ఎప్పటి నుండో మిత్రదేశంగా ఉంది భారత్ కు. ఇక ఇటీవల అమెరికా కూడా భారత్ కు అండగా నిలుస్తోంది. తాజాగా జో బైడెన్ కూడా భారత్ కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి ఎలాంటి ఆంక్షలు లేవని , అయితే ఆ సందర్భంలో పలు అంశాలపై చర్చించాల్సి ఉందని స్పష్టం చేసారు. భారత్ తో పాటుగా జపాన్ , జర్మనీ లకు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఒకవేళ భారత్ భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశంగా మారితే చిరకాల వాంఛ నెరవేరినట్లే !