అమెరికాలోనే కాదు సింగపూర్ లో కూడా భారతీయుల ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఆర్ధిక మాంద్యం వల్ల పలు సంస్థలు తమ ఉద్యోగులను తగ్గించుకుంటోంది. ఆర్ధిక భారం పడకుండా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి పలు సాఫ్ట్ వేర్ సంస్థలు. తాజాగా ఆ బాటలో ఇప్పుడు అమెరికా తర్వాత సింగపూర్ లో ఉన్న ఉద్యోగులను కూడా తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
సింగపూర్ లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వాళ్ళు మొత్తంగా 1,77, 100 మంది పనిచేస్తుండగా అందులో అత్యధికంగా 45 వేలకు పైగా మన భారతీయులు కావడం గమనార్హం. అయితే ఇప్పుడు ఐటీ రంగంలో ఊడిపోనున్న ఉద్యోగులలో ఎక్కువమంది భారతీయులేనట ! దాంతో ఎవరి మెడ మీద కత్తి వేలాడుతోంది అంటూ కంగారు పడుతున్నారు మన భారతీయులు. అమెరికాలో కూడా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లలో భారతీయులే అత్యధికులు కావడం గమనార్హం.