ఇంద్రభవనం లాంటి ఇవానా ట్రంప్ ఇంటిని అమ్మకానికి పెట్టారు. 8,725 చదరపు అడుగుల అందమైన ఈ భవనాన్ని 1992 లో 20 కోట్లకు కొన్నది. చేకొస్లేవియా కు చెందిన ఇవానా అమెరికాలో మోడల్ గా రాణించింది. కాగా అదే సమయంలో అప్పట్లో వ్యాపారవేత్త అయిన డొనాల్డ్ ట్రంప్ తో ప్రేమలో పడింది. దాంతో 1977 లో పెళ్లి చేసుకున్నారు.
15 ఏళ్ల పాటు కాపురం చేశారు. దాంతో ట్రంప్ – ఇవానా లకు ముగ్గురు పిల్లలయ్యారు. అయితే 1992 లో ట్రంప్ – ఇవానా ల మధ్య విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. దాంతో అప్పటి నుండి మాన్ హట్టన్ లోని ఈ విలాసవంతమైన భవనం లోనే ఉంటోంది ఇవానా ట్రంప్. అయితే 73 ఏళ్ల వయసులో ఈ ఏడాది జూన్ లో తన సొంత ఇంట్లోనే శవమై తేలింది. దాంతో సంచలనంగా మారింది ఈ విషయం. అయితే ఇవానా చనిపోవడంతో ఆమె ముగ్గురు పిల్లలకు ఈ భవంతి అమ్మి డబ్బులు పంచనున్నారట. అప్పట్లో 20 కోట్లకు కొనగా ఇప్పుడు అమ్మకం ద్వారా ఎంత వస్తుందో తెలుసా…… 215 కోట్లకు మించి రాబోతున్నాయి.