ఉత్తరవినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నాట్స్ అమెరికా తెలుగు సంఘం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంట్లో పిల్లలు ఆడుకునే ఎలక్ట్రానిక్ పరికరాలను కాస్త రిపేర్ కాగానే పడేస్తుంటారు చాలామంది. అయితే అలాంటి వస్తువులు చిన్న పాటి రిపేర్ తో బాగవుతాయి….. అలాగే ఆడుకునే పేద పిల్లలు కూడా ఉంటారు. అందుకే చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయని , లేకపోతె చాలా రోజులుగా వాడుతున్నామని భావించి వాటిని పడేసే బదులు మాకు ఇస్తే నిరుపేద పిల్లలకు ఆ వస్తువులను ఇస్తామని , వాళ్లకు ప్రయోజనకారిగా ఉంటాయని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఉత్తర అమెరికా తెలుగు సంఘం.
ల్యాప్ టాప్ , మొబైల్ ఫోన్స్ , కంప్యూటర్లు , కీబోర్డులు , కెమెరాలు , స్పీకర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించి పేద వాళ్లతో పాటుగా శరణార్థులైన పిల్లలకు రిపేర్ చేసి ఇచ్చే కార్యక్రమం చేపట్టింది ఉత్తర అమెరికా తెలుగు సంఘం. కరోనా కష్టకాలంలో తెలుగమ్మాయి శ్రావ్య ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టగా అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్రావ్య ని అభినందించాడు.