టెక్సాస్ లో మంకీ పాక్స్ బారిన పడిన వ్యక్తి మరణించాడు. దాంతో మంకీ పాక్స్ తొలిమరణం సంభవించిందని స్పష్టం చేసింది అగ్రరాజ్యం అమెరికా. గతకొంత కాలంగా మంకీ పాక్స్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మొదట్లో మంకీ పాక్స్ కేసులను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు ఎక్కువ అవుతుండటంతో WHO ( వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ) హెచ్చరికలు జారీ చేసింది.
దాంతో ప్రపంచ వ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. అయితే అప్పటికే చాలా దేశాల్లో పాకిపోయింది ఈ వ్యాధి. తాజాగా టెక్సాస్ లో మంకీ పాక్స్ తో ఓ వ్యక్తి మరణించడంతో అమెరికాలో తొలి మంకీ పాక్స్ మరణంగా తేల్చారు డాక్టర్లు. బలహీనంగా ఉన్న వాళ్లలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతోందని స్పష్టం చేసారు. ప్రజలంతా మంకీ పాక్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.