అమెరికాలో నాట్స్ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. North America Telugu Society తాజాగా బాలల సంబరాలను నిర్వహించింది. బాలలలో ఉన్న ప్రతిభను వెలికి తీయాలనే భావనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా భారీ ఎత్తున స్పందన లభించింది. పిల్లలు , పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. రెండు వందలమందికి పైగా బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నప్పటికి తెలుగు మూలాలు మర్చిపోకుండా తెలుగు పద్యాలు , గణిత ఛాలెంజ్ , తెలుగు జియో పార్టీ , క్లాసికల్ డ్యాన్స్ , సెమీ క్లాసికల్ డ్యాన్స్ , నాన్ క్లాసికల్ డ్యాన్స్ , క్లాసికల్ సింగింగ్ , ఫ్యాన్సీ డ్రెస్ , తెలుగు పండుగల థీమ్ లతో పాటుగా పలు అంశాలపై విభిన్న రకాల పోటీలను నిర్వహించారు నాట్స్ ప్రతినిధులు.
కార్యక్రమం ఆద్యంతం చక్కగా నిర్వహించడంతో పిల్లలతో పాటుగా పేరెంట్స్ కూడా నాట్స్ ప్రతినిధులను ప్రశంసలతో ముంచెత్తారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ చాటిన బాలబాలికలకు మెమెంటో లతో పాటుగా ప్రశంసా పత్రాలను కూడా అందించింది నాట్స్. నాట్స్ చైర్ విమెన్ గంటి అరుణ , కల్చరల్ చైర్ విమెన్ జాగర్లమూడి శ్రీదేవి , కల్చరల్ వైస్ చైర్ యలమంచిలి బిందు , ఉమా మాకం , శ్రీదేవి పులిపాక , చిక్క జయ , లావణ్య తొడుపునూరి , స్వర్ణ గడియారం , ప్రణీత పగిడిమర్రి , గాయత్రి చిట్టేటి , అనుజ వేజెళ్ళ , కోగంటి సమత , కళ్యాణి దేశ్ పాండే , హరి బుంగటావుల , శ్రీమన్ పుల్లఖండం , సురేష్ మాకం , రమణ యలమంచిలి , శ్రీనివాస్ తొడుపునూరి , నాగేశ్వర్ ఐతా , వెంకట్ జాగర్లమూడి , బసవసేఖర్ శంషాబాద్ తదితరులు ఈ పోటీలను చక్కగా నిర్వహించడంతో నాట్స్ ప్రతినిధులను నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి అభినందించారు.