అనాధ బాలుడికి అమెరికా దంపతులు అండగా నిలిచిన సంఘటన వైరల్ గా మారింది. కరోనా కష్టకాలంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధ అయిన ఓ బాలుడ్ని సంగారెడ్డి శిశు గృహ అధికారులు సంరక్షించారు. ఆ బాబుని అన్ని విధాలుగా బాగోగులు చూసుకుంటున్న సమయంలో అతడికి జబ్బు ఉన్న విషయం బయటపడింది.
అయ్యో ! ఆ చిన్నారి బాలుడికి ఇన్ని కష్టాలా ? అని ఆవేదన చెందుతున్న సమయంలో అమెరికా దంపతులు సదరు బాలుడ్ని దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి బాలుడ్ని తమ వెంట అమెరికాకు తీసుకెళ్లడానికి భారత్ చేరుకున్నారు. కరోనా తల్లిదండ్రులను పొట్టన పెట్టుకుంటే ఇప్పుడేమో కొత్త జీవితం ఇవ్వడానికి అమెరికా తల్లిదండ్రులు వచ్చారంటూ బాలుడి అదృష్టానికి పొంగిపోతున్నారు పలువురు.