
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన సర్జరీ చేసి చరిత్ర సృష్టించారు. ఓ 60 ఏళ్ల మహిళకు మెదడులో కణతి ఉండటంతో ఆ కణతి తొలగించాలంటే సదరు మహిళ మెలుకువతోనే ఉండాలని లేకపోతే ప్రాణాలకు ప్రమాదమని భావించిన వైద్యులు ఆమెకు ధైర్యం చెప్పి ఆమె అభిమాన హీరో ఎవరో తెలుసుకొని మెగాస్టార్ చిరంజీవి నటించిన అడవి దొంగ చిత్రాన్ని ట్యాబ్ లో చూపిస్తూ ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేసారు.
ఆపరేషన్ 2 గంటలకు పైగా జరుగగా ఆ రెండు గంటల పాటు చిరంజీవి నటించిన అడవిదొంగ చిత్రాన్ని చూస్తూ ఉండిపోయింది. సినిమా పూర్తి అయ్యే సమయానికి ఆపరేషన్ కుడి పూర్తి అయ్యింది . సర్జరీ విజయవంతం కావడంతో ఇది అరుదైన సంఘటనగా సంచలనం సృష్టించింది. దాంతో ఆపరేషన్ లో పాల్గొన్న వైద్యులను గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ అభినందించారు.