తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయమైపోయింది. దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ పేరు ”భారతీయ రాష్ట్ర సమితి ” గా నామకరణం చేసినట్టుగా తెలుస్తోంది. జాతీయ పార్టీ అంటే ఇక దేశ వ్యాప్తంగా తిరగాలి కాబట్టి తప్పకుండా స్పెషల్ ఫ్లైట్ ఉండాల్సిందే అని నిర్ణయించుకున్నారట దాంతో 80 కోట్లు ఖర్చు పెట్టి సొంత విమానం కొనుగోలు చేయడానికి నిర్ణయించారు కేసీఆర్.
ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ లో దాదాపు 900 కోట్ల నిధులు ఉన్నాయి. అయితే ఈ విమానం కొనుగోలు చేయడానికి మాత్రం పార్టీ ఫండ్ ఖర్చు చేయడం లేదు ఎందుకంటే కేసీఆర్ కు సొంత విమానం కోసం పలువురు నాయకులు , వ్యాపారవేత్తలు విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు దాంతో సొంత విమానం కొనడానికి సిద్ధమయ్యారు. సొంత విమానం ఉంటే దేశ వ్యాప్తంగా పర్యటించడానికి వీలుంటుందని దాంతో బీజేపీ ముక్త్ భారత్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు కేసీఆర్.