మహిళా దినోత్సవం రోజునే తండ్రి అయ్యాడు క్రికెటర్ ఉమేష్ యాదవ్. మార్చి 8 న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉమేష్ యాదవ్ భార్య తాన్య వద్వా . దాంతో ఈ సంతోషకరమైన వార్తను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 2013 మే 29 న పంజాబ్ కు చెందిన తాన్యాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఉమేష్ యాదవ్.
2021 లో ఈ ఇద్దరికీ మొదటి సంతానంగా ఒక పాప జన్మించింది. కట్ చేస్తే 2023 లో మహిళా దినోత్సవం రోజున మరో ఆడపిల్ల జన్మించింది. ఈ ఇద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు. దాంతో తనకు లక్ష్మీ దేవి లాంటి పిల్లలు పుట్టారని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఉమేష్ యాదవ్ కు ఆడపిల్ల పుట్టడంతో భారత క్రికెటర్లు తమ సంతోషం వ్యక్తం చేస్తూ సహచరుడికి శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఇక కూతురు పుట్టిన ఉత్సాహంతో ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్ కు సిద్దమౌతున్నాడు ఉమేష్ యాదవ్.
Blessed with baby girl ❤️ pic.twitter.com/nnVDqJjDGs
— Umesh Yaadav (@y_umesh) March 8, 2023