భౌతిక , ఖగోళ , గణిత శాస్త్రవేత్త అయిన సర్ ఐజాక్ న్యూటన్ పరిష్కరించని సమస్య అంటూ ఏది లేదు. తన అనుభవాన్నంతా రంగరించి అనేక సమస్యలను పరిష్కరించారు. అయితే ఆయన పరిష్కరించని సమస్యలు గణిత శాస్త్రంలో రెండున్నాయి. అయితే 350 సంవత్సరాలుగా ఆ సమస్య అలాగే ఉండిపోయింది. దాన్ని ఎవరూ పరిష్కరించలేకపోయారు.
కట్ చేస్తే భారతదేశానికి చెందిన 19 ఏళ్ల శౌర్యా రాయ్ ఆ సమస్యలను పరిష్కరించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫండమెంటల్ ప్రాక్టికల్ డైనమిక్స్ థియరీస్ లో సర్ ఐజాక్ న్యూటన్ సాల్వ్ చేయలేని రెండు పజిల్స్ ను శౌర్యా రాయ్ సాల్వ్ చేసాడు. ఈ అసాధాయాన్ని సుసాధ్యం చేసి పదేళ్ళు దాటింది. 2012 లోనే ఈ చరిత్రకు నాంది పలికాడు శౌర్యా రాయ్.