ఈరోజు వరల్డ్ కిడ్నీ డే దాంతో కిడ్నీ వ్యాధుల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు పలువురు వైద్య నిపుణులు. దైనందిన జీవితంలో రకరకాల అలవాట్ల వల్ల మనిషి రోజు రోజుకు పతనం అవుతున్నాడు. ఆహారపు అలవాట్లతో పాటుగా శారీరక శ్రమ లేకపోవడంతో మనిషి రోగాల పాలు అవుతున్నాడు. ఈరోజుల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య చాలా ఉంది దాంతో కిడ్నీ వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సవివరంగా చెబుతున్నారు డాక్టర్లు.
కిడ్నీ వ్యాధులకు కారణాలు ఏంటో తెలుసా ……
అదుపులో లేని మధుమేహం , వంశ పారపర్యంగా వచ్చే అవకాశం , ఒబేసిటీ , హైపర్ టెన్షన్ , జన్యు పరమైన లోపాలు , విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్ వాడటం ఇలా రకరకాల కారణాలతో కిడ్నీ వ్యాధులు సంభవిస్తాయి.
ఇక ఈ వ్యాధి సోకకుండా ….
మధుమేహం , రక్తపోటు ఉన్నవాళ్లు ప్రతీ ఆరు నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలి. వ్యాధి సోకిన తర్వాత చికిత్స పొందడం కంటే ముందుగానే ఆహారపు అలవాట్ల ను మెరుగు పరుచుకోవాలి. అలాగే జీవన శైలిని కూడా మార్చుకోవాలి.