21.4 C
India
Sunday, January 18, 2026
More

    సోనూ సూద్ హై యాక్షన్ థ్రిల్లర్ ‘ఫతే’ 2023 జనవరి లో సెట్స్ పైకి

    Date:

    Sonu Sood's High Octane Action Thriller Fateh to go on floor in January 2023సోనూ సూద్ ఈ పేరు వింటే సామాన్యుడి పెదవిపై చిరునవ్వు విరబూస్తుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న భయంకరమైన కరోనా మూలంగా చితికిపోయిన ఎందరో గడపల్లో దీపమై, వారికి కుటుంబాలకు ఆరాధ్యుడు అయ్యాడు. బాలీవుడ్‌లో స్టార్ నటుడిగా కొనసాగుతున్న సోనుసూద్ 2023 లో ఒక అత్యంత శక్తివంతమైన సబ్జెక్ట్ తో హై యాక్షన్ థ్రిల్లర్ ‘ఫతే’ తో మనముందుకు రాబోతున్నారు.

    భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ జనవరి 2023లో సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. అత్యంత ప్రభావంతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఢిల్లీ, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశానికి కొరియోగ్రఫీ చేయడానికి లాస్ ఏంజిల్స్ నుండి ప్రత్యేక అంతర్జాతీయ సిబ్బందిని రప్పించనున్నారు.

    ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ.. ఈ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్ విన్నప్పుడు నాకు చాలా థ్రిల్ ని కలిగించింది. ఈ సినిమాను 2023లో ప్రారంభం కానుందని.. ఆయన కూడా ఫస్ట్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నాను తెలిపారు. అదేవిధంగా ఇది చాలా శ్రమతో కూడుకున్న చాలా విలువైన సబ్జెక్ట్ అని, ఈ సినిమా ద్వారా ఆయన కూడా చాలా విశయాల్లో నైపుణ్యం సాధించలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

    సోనూ సూద్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోహీరోయిన్లుగా వైభవ్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

    సోనూ సూద్ , హిందీ, తెలుగు, తమిళం మరియు కన్నడ చిత్రాలలో ‘యువ’, ‘అతడు’, ‘ఆషిక్ బనాయా ఆప్నే’, ‘జోధా అక్బర్’, ‘కందిరీగ’, ‘షూటౌట్ ఎట్ వడాలా’ వంటి అనేక హిట్‌లను అందించారు, ‘ఆర్… రాజ్‌కుమార్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘సింబా’ మరియు ‘కురుక్షేత్ర’, ఇతర వాటిలో అలరించి మెప్పించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actor Sonu Sood : తన అరెస్ట్ వారెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటుడు సోనూసూద్

    Actor Sonu Sood : నటుడు సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ...

    Actor Sonu Sood : ఏపీకి అంబులెన్సులు ఇచ్చిన నటుడు సోనూ సూద్

    Actor Sonu Sood donates ambulances : రియల్ హీరో సోనూ...

    Sankalp Diwas : నవంబర్ 28న సుచిరిండియా ఫౌండేషన్ ‘సంకల్ప్ దివాస్’

    - ప్రముఖ నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం Sankalp Diwas...

    New Jersey : ఇండియా ఇండిపెండెన్స్ డే సందర్భంగా న్యూ జెర్సీలో భారీ ర్యాలీ.. హాజరైన సోనూసూద్, సోనాల్..

    భారీ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగిందంటే? New Jersey :...