BRO పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘బ్రో’.. ఈ సినిమా ఈ వీకెండ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది. జులై 28న ఈ సినిమా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.. ఈ క్రమంలోనే మేకర్స్ వరుస ప్రమోషన్స్ చేస్తున్నారు.
త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. ఇక నిన్న రాత్రి బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లోకి పవర్ స్టార్ కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.. ఈ వేదికపై పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మాట్లాడిన స్పీచ్ నెట్టింట వైరల్ అవుతుంది..
సాయి తేజ్ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. కళ్యాణ్ మామయ్య ఫోన్ చేసి ఒక సినిమా చేయాలిరా అన్నాడు.. మల్టీస్టారర్ అని నువ్వు లీడ్ నేను సపోర్టింగ్ యాక్టర్ గా నటిస్తానని చెబితే నేను ఒప్పుకోలేదు.. వెంటనే ఇంటికి రమ్మని పిలిచాడు.. ఆ తర్వాత నన్ను కన్విన్స్ చేసాడు.. అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు నాకు యాక్సిడెంట్ అయ్యింది.
12 రోజులపాటు కోమాలో ఉన్నాను.. ప్రతీ రోజు కళ్యాణ్ మామ నా దగ్గరికి వచ్చి నీకు ఏం కాదని చెప్పేవాడు.. ఆ మాటలు నాకు వినిపించేవి.. నా చేయి పట్టుకుని ఆ మాట చెప్పేవాడు.. థాంక్యూ మామయ్య థాంక్యూ సో మచ్ లవ్ యు అని సాయి తేజ్ ఎమోషనల్ అయ్యాడు.. ఈయన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.. ఈ సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాలి..