తమిళ దర్శకులు బాలా ఇంటి ముందు నిర్మాత వీఏ దురై ధర్నా చేయడం సంచలనంగా మారింది. తమిళంలో అప్పట్లో సంచలన చిత్రాలకు దర్శకత్వం వహించాడు బాలా. అలా దర్శకత్వం వహించిన చిత్రాలలో పితామగన్ చిత్రం కూడా ఒకటి. ఆ చిత్ర నిర్మాత వీఏ దురై. పితామగన్ చిత్రానికి అవార్డులు వచ్చాయి…… మంచి పేరు కూడా వచ్చింది.
అయితే విక్రమ్ , సూర్య లాంటి స్టార్ హీరోలు నటించడంతో బడ్జెట్ ఎక్కువ అయ్యింది. సినిమా హిట్ అయినప్పటికీ నిర్మాతకు నష్టాలే వచ్చాయి. దాంతో మీకు మరో సినిమా చేసి పెడతాను అని మాట ఇచ్చాడట దర్శకుడు బాలా దాంతో 10 లక్షల అడ్వాన్స్ ఇచ్చాడు అప్పట్లో. అయితే బాలా మాత్రం వీఏ దురై కు సినిమా చేయలేదు.
ప్రస్తుతం ఈ నిర్మాత పరిస్థితి బాగోలేదట. ఆర్ధిక కష్టాలతో బాధపడుతున్నాడు. దాంతో తాను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని అడుగుతుంటే ఇవ్వకపోగా సమాధానాలు కూడా ఇవ్వడం లేదట. అంతేకాదు ఇంటికి వెళ్లి అడిగితే వెళ్లగొడుతున్నారట. దాంతో అవమానంగా భావించిన దురై బాలా ఇంటి ముందు ధర్నా కు దిగాడు. దాంతో తమిళనాట సంచలనం అయ్యింది. ఈ విషయం ఛాంబర్ దృష్టికి రావడంతో దురై తో మాట్లాడి విషయం సద్దుమణిగేలా చేశారట. ఛాంబర్ పెద్దలు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించాడు.