
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా నటించిన కన్నడ సూపర్ హిట్ చిత్రం ” వేద ” . డిసెంబర్ 23 , 2022 న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా శివరాజ్ కుమార్ సొంత సినిమా కావడం విశేషం. కన్నడ నాట శివరాజ్ కుమార్ సూపర్ స్టార్ అనే విషయం తెలిసిందే. కన్నడంలో విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు. త్వరలోనే డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.