2022 సూపర్ స్టార్ మహేష్ బాబుకు బ్యాడ్ ఇయర్ అనే చెప్పాలి. ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరిలో అన్న రమేష్ బాబు మరణించాడు. సరిగ్గా అదే సమయంలో మహేష్ బాబుకు కరోనా సోకింది. దాంతో తాను ఎంతగానో అభిమానించే అన్నయ్య ముఖం చూడలేకపోయాడు మహేష్. కరోనా కారణంగా వీడియో కాల్ లోనే అన్నయ్య పార్దీవ దేహాన్ని చూడాల్సిన ఘోర పరిస్థితి తలెత్తింది.
ఆ దారుణ సంఘటన నుండి కోలుకున్న తర్వాత సెప్టెంబర్ లో అమ్మ ఇందిరా దేవి మరణించింది. మహేష్ కు తల్లి ఇందిర అంటే అమితమైన ప్రేమ. ఆ షాక్ నుండి పూర్తిగా కోలుకోకముందే ఇప్పుడేమో తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. దాంతో మహేష్ బాబు ను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదట.
ప్రస్తుతం కృష్ణ కుటుంబ సభ్యులంతా గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆసుపత్రిలోనే కొన్ని ప్రత్యేక గదులు తీసుకొని ఉన్నారు. నాన్నను బ్రతికించుకోవడానికి అవసరమైతే విదేశీ డాక్టర్లను కూడా పిలిపించండి అని కోరాడట. ఫారిన్ కు ఏమాత్రం తీసిపోని డాక్టర్ల బృందం మన దగ్గర ఉంది. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని చెప్పారట డాక్టర్లు. అయితే బ్రెయిన్ పరిస్థితి బాగోలేదని, అలాగే ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు, ఊపిరితిత్తులు కూడా దెబ్బతినడంతో దేవుణ్ణి మాత్రమే ప్రార్ధించాలని అంటున్నారు డాక్టర్లు.
దాంతో మహేష్ బాబు మరింతగా కుమిలిపోతున్నాడట. ఒక్క ఏడాదిలోనే తాను ఎంతగానో ప్రేమించేవాళ్ళు దూరం అవుతున్నారని కన్నీళ్ళ పర్యంతమయ్యాడట. నిజంగానే మహేష్ బాబుకు ఇది బ్యాడ్ ….. బ్యాడ్ ఇయర్ అనే చెప్పాలి. వరుస సంఘటనలు మహేష్ ను తీవ్ర దుఃఖసాగరంలో ముంచెత్తు తున్నాయి. తెలుగు ప్రజల గుండెల్లో అల్లూరి సీతారామరాజు గా నిలిచిపోయిన మహనీయులు సూపర్ స్టార్ కృష్ణ . ఆ మహనీయుడు కోలుకోవాలని ఆశిస్తోంది jaiswaraajya.tv