
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు సారీ చెప్పింది హాలీవుడ్ నటి టిగ్ నొటారో. ఈ సంఘటన తాజాగా అమెరికాలో జరిగింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. కాగా ఆ అవార్డుల వేడుకకు హాలీవుడ్ నటి టిగ్ నొటారో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అయితే చరణ్ ని వేదిక మీదకు పిలిచే సమయంలో పూర్తి పేరు తెలియక ఇబ్బంది పడింది. రామ్ అని మాత్రమే సంభోధించింది.
ఆ తర్వాత తన వెనకున్న వాళ్ళను అడిగి రామ్ చరణ్ అంటూ పూర్తి పేరు పలికింది. ఇక చరణ్ వేదిక మీదకు రాగానే అతడి దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది టిగ్. చరణ్ కు సారీ చెపుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డులతో మరోసారి ఆర్ ఆర్ ఆర్ మారుమ్రోగుతోంది. ఇక ఇదే వేదిక పై చరణ్ , దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తదితరులు అవార్డులు అందుకున్నారు.
చరణ్ తో పాటుగా దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి , సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి , పాటల రచయిత చంద్రబోస్ అమెరికాలో ఉన్నారు. మరో వారం రోజుల్లోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా అమెరికా వెళ్లనున్నాడు. మార్చి 12 న ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరుగనుంది. ఆ వేడుకలో నాటు నాటు అనే పాట ఆస్కార్ గెలుచుకుంటుందని భావిస్తున్నారు.