
డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ” ఆదిపురుష్ ”. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2023 జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే అక్టోబర్ 2 న మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని రామజన్మ భూమి అయిన అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ ను భారీ ఎత్తున విడుదల చేసారు.
ఆ టీజర్ చూసిన వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదేదో యానిమేటెడ్ మూవీ లాగా ఉంది తప్ప రామాయణం కాదని , అలాగే ప్రభాస్ లుక్ కూడా అంతగా బాగలేదని అంటున్నారు. అంతేనా …….. రావణాసురుడుగా నటించిన సైఫ్ అలీఖాన్ కళ్ళకు సుర్మా రాసి మరీ దారుణంగా చిత్రీకరించారని దర్శకుడు ఓం రౌత్ పై పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ టీజర్ పట్ల సంతోషంగా లేరు. విజువల్స్ లో రాజమౌళిని కొట్టేవాడు లేడని , ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని ఏం చేస్తాడో అంటూ భయపడుతున్నారు కూడా. ఆదిపురుష్ ట్రోలింగ్ ఎలా ఉందంటే ……. ట్రోలింగ్ లో ఇదే నెంబర్ వన్ గా ఉంది మరీ. విజువల్స్ చూస్తే మాత్రం ఆసక్తికరంగా లేవు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. వచ్చే ఏడాది 2023 జనవరి 12 న ఈ సినిమా విడుదల కానుంది. నెటిజన్లు విపరీతంగా ఆదిపురుష్ చిత్రాన్ని అలాగే ఓం రౌత్ ను ట్రోల్ చేస్తున్నారు అయితే దర్శకుడు మాత్రం ఇంకా స్పందించలేదు.