
న్యూయార్క్ మహానగరంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జెండా పండుగ జరిగింది. కాగా ఆ పండగలో పాల్గొన్నాడు హీరో అల్లు అర్జున్. న్యూయార్క్ లోని ప్రధాన నగరాలలో ఈ జెండా పండగ జరుగగా ఆ వేడుకలలో పెద్ద ఎత్తున భారతీయులు పాల్గొన్నారు. ఇక అల్లు అర్జున్ కు ఘనస్వాగతం లభించింది. ఈ పర్యటనలో అల్లు అర్జున్ వెంట ఆయన సతీమణి అల్లు స్నేహా రెడ్డి కూడా పాల్గొన్నారు. అమెరికాలోని తెలుగువాళ్లు , అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన భారతీయులు తన పట్ల చూపిస్తున్న అభిమానానికి పరవశించిపోయాడు.
అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 చిత్రం చేయనున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. మొదటి పార్ట్ వసూళ్ల వర్షం కురిపించడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా కథలో చాలా మార్పులు చేశారట దర్శకులు సుకుమార్. అలాగే ఇప్పటికే పాటలు అలాగే ఆ పాటలకు సంగీతం కూడా అద్భుతంగా సెట్ అయ్యిందట. చంద్రబోస్ ఈ పార్ట్ 2 కు కూడా అన్ని పాటలు రాస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే పుష్ప 2 సెట్స్ మీదకు వెళ్లనుంది.