డార్లింగ్ ఫ్యాన్స్ కోసం బిల్లా చిత్రాన్ని మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2009 లో వచ్చిన బిల్లా మంచి విజయం సాధించింది. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయగా సాలిడ్ అందాల భామ అనుష్క హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అనుష్క అందాలు హైలెట్ గా నిలిచాయి. బికినీ లో వీరంగం వేసిన అనుష్క అందాల కోసం మళ్లీ మళ్లీ ఈ చిత్రాన్ని చూశారంటే అతిశయోక్తి కాదు సుమా ! ప్రతీకారం తీర్చుకునే పాత్రలో అనుష్క నటించినప్పటికి అందాలను ఆరబోయడంలో మాత్రం ఎక్కడా తగ్గనేలేదు ఈ భామ. పైగా ఇది తన డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో మరింతగా రెచ్చిపోయి అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రభాస్ పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు నిర్మించడం విశేషం. అంతేకాదు ఈ చిత్రంలో కృష్ణంరాజు కూడా నటించాడు. ఇక మరో భారీ అందాల భామ నమిత , అలీ , రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించగా హీరోయిన్ హన్సిక ఓ ఐటమ్ సాంగ్ చేయడం విశేషం. ఇక ఇప్పటి విషయానికి వస్తే…….. అక్టోబర్ 23 న డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు దాంతో ఆ సందర్భంగా బిల్లా సినిమాను ప్రదర్శించడానికి సమాయత్తం అవుతున్నారు. 4 K రెసొల్యూషన్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.