కరోనా మళ్ళీ నేనున్నానంటూ ప్రజలను భయపెడుతోంది. చైనా లో కరోనా విలయాన్ని సృష్టిస్తోంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కల్లోలం మొదలైంది. దాంతో భారత్ కూడా అప్రమత్తమైంది. కరోనా వల్ల ప్రపంచం ఎలా భయానికి లోనయ్యిందో 2020 లో చవిచూసిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే సమయంలో నేనున్నానంటూ భారత ప్రజలకు అభయమిచ్చాడు సోనూ సూద్.
మళ్ళీ రెండేళ్ల తర్వాత కూడా కరోనా మరోసారి విలయానికి సిద్ధం అవుతుండటంతో మళ్ళీ నేనున్నానంటూ అభయ హస్తం ఇస్తున్నాడు సోనూ సూద్. అందరూ జాగ్రత్తగా ఉండండి …….. ధైర్యంగా ఉండండి . అవసరమైతే నావంతు సహాయం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఫోన్ పనిచేస్తూనే ఉంటుంది అంటూ ఆపన్న హస్తం అందించాడు అభినవ దాన కర్ణుడు సోనూ సూద్.
2020 లో కరోనా విలయాన్ని సృష్టించినప్పుడు వలస కార్మికులకు అండగా నిలిచాడు సోనూ సూద్ . వాళ్ళను తన సొంత ఖర్చులతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి స్వగ్రామాలకు చేర్చాడు. ఇక రెండో వేవ్ లో సరైన సమయానికి అవసరమైన మెడిసిన్స్ అందకుండా , ఆక్సీజన్ అందకుండా ఇబ్బంది పడిన వాళ్లకు అండగా నిలిచాడు. ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్ లను అందించి ప్రాణాలను నిలిపాడు. ఇక ఇప్పుడేమో మళ్ళీ కరోనా విరుచుకుపడుతుండటంతో భయపడొద్దు …… నేనున్నానంటూ అభయ హస్తం అందించాడు.