నిన్న రాత్రి అనంతపురంలో గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున జరిగింది. కాగా ఈ ఈవెంట్ ప్రారంభమైనప్పుడు వర్షం లేదు కానీ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడే సమయంలో మాత్రం జోరుగా వర్షం కురిసింది. దాంతో ఆ వర్షంలో కూడా మెగాస్టార్ స్పీచ్ ఇచ్చాడు. నేను ఇంద్ర సినిమా షూటింగ్ కోసం రాయలసీమకు వచ్చినప్పుడు వర్షం కురిసిందని , అలాగే ప్రజారాజ్యం పార్టీ పెట్టి పులివెందులకు ప్రచారానికి వచ్చిన సమయంలో కూడా వర్షం పడిందని , ఇక ఇప్పుడేమో గాడ్ ఫాదర్ కోసం ఇక్కడికి వస్తే …….. మళ్ళీ వర్షం ఆశీర్వదించిందని సంతోషం వ్యక్తం చేసాడు.
ఇక వర్షం పడుతుంటే మెగాస్టార్ తడిసిపోతుండటంతో గొడుగులు పట్టారు. అయితే మెగాస్టార్ మాత్రం ఆ గొడుగులు వద్దని వారించాడు. వర్షంలోనే తడుస్తూ అశేష అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు. దాంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. మెగాస్టార్ మాట్లాడుతుంటుంటే ఈలలు , గోలలతో సందడి చేసారు మెగా అభిమానులు.
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5 న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం లో సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు . నయనతార , సత్యదేవ్ , సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.