
డిసెంబర్ 13 వెంకీ మామ పుట్టినరోజు. దాంతో ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా నారప్ప చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కేవలం ఈరోజు ఒక్క రోజు మాత్రమే థియేటర్ లలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఇలా షోల ద్వారా వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోస్తామని , ఒక్క పైసా కూడా తీసుకోమని అంటున్నాడు వెంకటేష్ అన్నయ్య నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు.
1960 డిసెంబర్ 13 న జన్మించిన వెంకటేష్ బాల నటుడిగా ఒకటి రెండు చిత్రాల్లో నటించాడు. ఇక హీరోగా కలియుగ పాండవులు చిత్రంతో పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకొని విక్టరీ పేరును సార్ధకం చేసుకున్నాడు. అయితే కలియుగ పాండవులు తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేక పోయాడు. దాంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఆ విమర్శలకు కుంగిపోలేదు…… హీరోగా తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. హీరోగా పరిచయం అయ్యింది 1986 లో …… అయితే కేవలం నాలుగేళ్ళ కాలంలోనే స్టార్ హీరోగా తెలుగునాట సత్తా చాటాడు.
యాక్షన్ తో పాటుగా కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు వెంకీ. మూడున్నర దశాబ్దాలుగా టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసాడు వెంకీ మామ. చిరంజీవి, బాలయ్య, నాగార్జున లతో పోటీ పడుతూ టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలలో నాలుగో స్థంభంగా నిలిచాడు.
ఈరోజు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భంగా వెంకీ మామకు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది JSW & Jaiswaraajya.tv. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో నారప్ప చిత్రాన్ని పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. దాంతో తెలుగు రాష్ట్రాలలో వెంకీ అభిమానులు థియేటర్ ల వద్ద హంగామా చేస్తున్నారు. అలాగే రోగులకు పండ్లు , పాలు , బ్రెడ్ పంచుతున్నారు.