హీరో శర్వానంద్ తెలంగాణ అల్లుడు కాబోతున్నాడు. శర్వానంద్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే విషయం తెలిసిందే. 38 సంవత్సరాల శర్వానంద్ ఎట్టకేలకు పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలంగాణ రెడ్డి సామజిక వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు శర్వా.
రెడ్డి సామజిక వర్గానికి చెందిన హైదరాబాదీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అమెరికాలో కొన్నాళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసింది కాబోయే పెళ్లి కూతురు. రాజకీయ , వ్యాపార రంగాల వారితో అనుబంధం ఉన్న ఫ్యామిలీ కావడంతో కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఈ పెళ్లి నిశ్చయం అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ పెళ్లి వేసవిలో జరుగనున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని వ్యవహారాలు మాట్లాడుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య చర్చలు అయిపోయాయి దాంతో వేసవిలో పెళ్లి జరుగబోతోంది.
మొత్తానికి శర్వానంద్ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లైఫ్ ముగిసినట్లే ! ఇక సినిమాల విషయానికి వస్తే ….. ఇటీవల కాలంలో శర్వానంద్ ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్నాడు. పెళ్లి తర్వాత శర్వానంద్ ఎలాంటి విజయాలు అందుకుంటాడో చూడాలి.