34.7 C
India
Friday, April 10, 2026
More

    ఎన్టీఆర్‌ వాచ్‌ రేట్ తెలిస్తే వావ్ అంటారు…!

    Date:

    If you know the watch rate of NTR, you will say wow
    If you know the watch rate of NTR, you will say wow

    జనరల్‌గా ప్రతీ ఒక్క మనిషికీ ఏదో ఒక ఇష్టం ఉంటుంది. కొందరికి కార్లు.. కొందరికి ఫోన్లు.. ఇంకొందరికి బట్టలు. ఇలా ఒక్కొక్కికీ ఒక్కోటి. వాళ్ల ఇష్టం కోసం ఏమైనా చేస్తుంటారు. ఎంతైనా ఖర్చు పెడుతుంటారు. ఇలాగే మన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు వాచ్‌లు అంటే తెగ పిచ్చి. సాధారణంగా మనం వాచ్‌లు కొంటే ఏ రేంజ్‌లో కొంటాం. వందలు మహా అయితే వేలు. కానీ ఎన్టీఆర్‌ కొనే ఒక్కో వాచ్‌ కోట్లలో ఉంటుంది. అది కూడా ఏదిపడితే అది కాదు. స్పెషల్‌గా రిచర్డ్‌ మిల్లే కంపెనీకి చెందిన స్పెషల్‌ ఎడిషన్‌ వాచ్‌లనే కొంటుంటాడు ఎన్టీఆర్‌.

    ఇప్పటికే తారక్‌ దగ్గర ఈ వాచ్‌ల కలెక్షన్‌ ఉంది. గతంలో ఓ పార్టీలో రెండు కోట్ల వాచ్‌ పెట్టుకుని అందరినీ షాక్‌ చేశాడు ఎన్టీఆర్‌. ఇక ట్రిపులార్ ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్‌ పెట్టుకున్న వాచ్‌ అక్కడున్న ప్రతీ ఒక్కరినీ ఎట్రాక్ట్‌ చేసింది. దీని కాస్ట్‌ ఎంత అని నెటిజెన్స్‌ ఆరా తీస్తే 4 కోట్ల 20 లక్షలు అని తెలియడంతో షాకయ్యారు. ఇప్పుడు దాన్ని మించి మరో కాస్లీ వాచ్‌ కొన్నాడు ఎన్టీఆర్‌. రిచర్డ్‌ మిల్లే ఆర్‌ఎమ్‌40-01 అనే మోడల్‌ వాచ్‌ను 8 కోట్ల 20 లక్షలు పెట్టి కొన్నాడు. రీసెంట్‌గా జరిగిన ఓ పార్టీలో ఈ వాచ్‌ పెట్టుకుని కనిపించాడు ఎన్టీఆర్‌.

    జర్మన్‌కు చెందిన రిచర్డ్‌ మిల్లే కంపెనీ వాచ్‌లు చాలా ఎక్స్‌పెన్సీవ్‌. ప్రీ ఆర్డర్‌ ఇచ్చి చేయించుకోవాలి. ఈ కంపెనీ నుంచి ఏ కొత్త మోడల్‌ వచ్చినా ఫస్ట్‌ కొనేస్తాడు మన యంగ్‌ టైగర్‌. తనకు వాచెస్‌ అంటే చాలా ఇష్టమని గతంలో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు ఎన్టీఆర్‌. తన వాచ్‌ కలెక్షన్‌ను తన కొడుకులు ఇవ్వాలనేది ఆయన డ్రీమ్‌ అట. అందుకే ఇలా కాస్లీ వాచ్‌ కలెక్షన్‌ను మెయిన్‌టేన్‌ చేస్తున్నాడట. వాచ్‌లతో పాటు కార్లంటే కూడా తనకు చాలా ఇష్టమని తారక్‌ చాలాసార్లు చెప్పాడు. కార్ల విషయం ఏమోగానీ ఇప్పుడు ఈ వాచ్‌ రేట్‌ ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 8 కోట్లు పెట్టి వాచ్‌ కొనడం ఏంటన్నా అంటూ తారక్‌ ఫ్యాన్స్‌ షాకవుతున్నారు. ఆ వాచ్‌ ఇస్తే మా బ్యాచ్‌ సెట్‌ అవుద్ది అంటూ జోకులు వేస్తున్నారు. సినిమాల్లో సంపాదించింది మొత్తం వాచ్‌లకు పెట్టేస్తున్నావా అన్నా అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    Balayya : బాలయ్య బాబు, ఎన్టీఆర్ మధ్య మాటలు కలిపింది ఎవరో తెలుసా..?

    Balayya : తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో వరుసగా సక్సెస్‌ఫుల్...

    NTR : ఎన్టీఆర్ ఫేస్ లో కల పోయిందా..? ఎందుకిలా చేశాడు..?

    Jr. NTR : ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ చూసినవాళ్లు ఒక్క సారి...

    NTR : ఎన్టీఆర్‌ను రజనీకాంత్‌తో పోలుస్తున్నారా?

    NTR : రజనీకాంత్‌కు ఒక ప్రత్యేకమైన శైలి ఉండటం వల్లనే ఆయన చాలా...