Home VENDITHERA TOLLYWOOD JR.NTR:జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ పై ఆగ్రహం

JR.NTR:జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ పై ఆగ్రహం

78
jrntr-anger-over-jr-ntrs-tweet
jrntr-anger-over-jr-ntrs-tweet
jrntr-anger-over-jr-ntrs-tweet
jrntr-anger-over-jr-ntrs-tweet

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఓ ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా సాగడంతో కొంతమంది నందమూరి అభిమానులు జూనియర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఎన్టీఆర్ కు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. ఇంతకీ ఈ వివాదానికి కారణం ఏంటో తెలుసా ……

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కాస్త డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా జగన్ ప్రభుత్వం పేరు మార్చడమే !అయితే ఈ పేరు మార్పు పై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది. అలాగే నందమూరి కుటుంబం కూడా ఈ విషయం పై ఆగ్రహంగా ఉంది అందుకే మీడియాకు ప్రకటన కూడా విడుదల చేసారు.

అయితే అందులో ఎన్టీఆర్ పేరు లేదు దాంతో జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు. అది కొంతమంది నందమూరి అభిమానులను ఆవేశానికి లోనయ్యేలా చేసింది. జగన్ ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించకుండా ఇలా ట్వీట్ చేయడం ఏంటి ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ , వైఎస్సార్ ఇద్దరు కూడా తెలుగు జాతికి సేవలు అందించిన వాళ్ళు . ఒకరి పేరు తీసేసి మరొకరి పేరు పెట్టడం వల్ల ఎన్టీఆర్ స్థాయి తగ్గించించలేరు అన్నట్లుగా ట్వీట్ చేసాడు కానీ కాస్త పదునైన మాటలు వాడాలి కదా ! అని భావిస్తున్నారు నందమూరి అభిమానులు. బయట జనాలకు కోపం ఉంది కానీ కుటుంబ సభ్యులకు అందునా జూనియర్ ఎన్టీఆర్ కు ఆ కోపం లేదా ? అని ప్రశ్నిస్తున్నారు.