నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన చిత్రం కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 13 న విడుదలై సంచలన విజయం సాధిస్తోంది. రోజు రోజుకు మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతూ థియేటర్లు కూడా పెరుగుతూ అయిదు రోజుల్లోనే 40 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ చిత్రం అవలీలగా 100 కోట్ల మార్క్ దాటడం ఖాయమని అంటున్నారు. ఓవరాల్ గా 100 నుండి 150 కోట్లు కలెక్ట్ చేయొచ్చని తెలుస్తోంది.
అయితే ఇదే చిత్రాన్ని డార్లింగ్ ప్రభాస్ చేసి ఉంటే ఖచ్చితంగా 1000 కోట్ల సినిమా అయ్యుండేదని అంటున్నారు. నిఖిల్ చిన్న హీరో కాబట్టి ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయని , అలాగే ఓపెనింగ్స్ కూడా బాగానే ఉన్నప్పటికీ ఇదే ప్రభాస్ చేసి ఉంటే ఈపాటికే 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఉండేదని , ఓవరాల్ గా 1000 కోట్ల సినిమా అయ్యుండేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ప్రభాస్ తాజాగా సలార్ , ఆదిపురుష్ , ప్రాజెక్ట్ – K చిత్రాలు చేస్తున్నాడు. ఆదిపురుష్ చిత్రం షూటింగ్ అయిపొయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ – K షూటింగ్ కి బ్రేక్ పడింది. ప్రస్తుతం షూటింగ్ లు ఆగిపోవడంతో కొంత విరామం ఏర్పడింది. త్వరలోనే మళ్ళీ ప్రాజెక్ట్ – కె షూటింగ్ లో పాల్గొననున్నాడు ప్రభాస్.
Breaking News
KARTHIKEYA 2- PRABHAS- NIKHIL:కార్తికేయ 2 ప్రభాస్ చేసి ఉంటే 1000 కోట్ల సినిమా అయ్యేదట
Date: