మానాన్న నన్ను లైంగికంగా వేధించాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది నటి కుష్బూ. 80- 90 వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భామ కుష్బూ. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఈ భామ పెద్ద స్టార్ హీరోయిన్. కుష్బూని ఎంతగా ఆరాధించే వారంటే తమిళనాట ఏకంగా గుడి కట్టించారు. అంతగా ఆరాధించారు కుష్బూను.
గతకొంత కాలంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఈ భామను తాజాగా కేంద్ర ప్రభుత్వం ” జాతీయ మహిళా కమీషన్ ” సభ్యురాలిగా నియమించింది. దాంతో పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇస్తోంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా తన కన్నతండ్రి పై సంచలన ఆరోపణలు చేసింది. నా కన్నతండ్రి నన్ను లైంగికంగా వేధించాడు. అప్పుడు నా వయసు కేవలం 8 సంవత్సరాలు మాత్రమే !
అయితే తండ్రి వేధింపుల గురించి అమ్మకు చెప్పాను కానీ ఆమె నమ్మలేదు. పతియే ప్రత్యక్ష దైవం అనే బాపతు మా అమ్మ. ఆమెను విపరీతంగా కొట్టేవాడు ,బూతులు తిట్టేవాడు. అయినా అన్నీ ఓపికగా భరించింది. నాకు 15 సంవత్సరాల వయసులో ఎదురు తిరగడం ప్రారంభించాను ….. సినిమాల్లోకి వచ్చాక మళ్ళీ అతడ్ని నేను చూడలేదు …… మాట్లాడలేదు. నేను హీరోయిన్ గా సక్సెస్ అయ్యాక నన్ను వెతుక్కుంటూ వచ్చాడు కానీ నేను కనికరించలేదు అంటూ అతడి పట్ల తనకున్న ద్వేషాన్ని వెల్లడించింది.
మహిళలపై లైంగిక దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని , ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడులలో ఎక్కువగా కుటుంబ సభ్యుల నుండే అంటూ బాంబ్ పేల్చింది కుష్బూ. నేను జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టానని , నాకు సాధ్యమైనంత వరకు న్యాయం చేయడానికి ముందుంటానని స్పష్టం చేసింది. ఒక్క పోస్ట్ కార్డు మీద నాకు ఫిర్యాదు చేసినా చాలు న్యాయం చేస్తానని అంటోంది కుష్బూ.