టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హాట్ భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ” ఆరంభం ” అనే టైటిల్ ను పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు త్రివిక్రమ్. ఈ దర్శకుడికి అ , ఆ అనే సెంటిమెంట్ ఉందనే విషయం తెలిసిందే.
గతంలో త్రివిక్రమ్ పలు చిత్రాలకు తన సెంటిమెంట్ తోనే టైటిల్స్ పెట్టాడు. కట్ చేస్తే ఇప్పుడు మహేష్ బాబు చిత్రానికి కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అందుకే ” ఆరంభం ” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ” అతడు ” , ” ఖలేజా ” చిత్రాలు వచ్చాయి. అతడు యావరేజ్ కాగా ఖలేజా ప్లాప్ అయ్యింది. అయితే ఈ రెండు చిత్రాలు కూడా టీవీలో మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యాయి.
ఇక ఇపుడు ముచ్చటగా మూడో చిత్రంగా వస్తున్న SSMB28 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే అతడు , ఖలేజా నాటికి అటు మహేష్ బాబు కానీ ఇటు త్రివిక్రమ్ కు కానీ ఇప్పుడున్నంత మార్కెట్ లేదు. ఇప్పటి రేంజ్ వేరు కాబట్టి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే భారీ డీల్స్ సెట్ అవుతున్నాయి బిజినెస్ పరంగా. పూజా హెగ్డే తో పాటుగా శ్రీలీల కూడా మహేష్ బాబుతో రొమాన్స్ చేయనుంది. ఇద్దరు ముద్దుగుమ్మలతో మహేష్ స్క్రీన్ స్పేస్ ఫ్యాన్స్ కు చూడముచ్చటగా ఉండటం ఖాయం.