స్టార్ హీరోలు నటించిన ఓల్డ్ బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇటీవల మళ్లీ విడుదల చేయడం అలవాటు అయ్యింది. ఇప్పుడు ఆ కోవలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం కూడా విడుదల కానుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా……. ఘరానా మొగుడు. 90 వ దశకంలో వచ్చిన ఘరానా మొగుడు అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. అప్పట్లోనే 10 కోట్ల షేర్ రాబట్టి ట్రేడ్ విశ్లేషకులను షాక్ అయ్యేలా చేసింది.
కట్ చేస్తే త్వరలోనే ఘరానా మొగుడు చిత్రం విడుదల కానుంది. ఆగస్ట్ 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు దాంతో ఆ సందర్భంగా ఘరానా మొగుడు చిత్రం స్పెషల్ షోలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు మెగా అభిమానులు. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘరానా మొగుడు విడుదల కానుంది.