మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ” వాల్తేరు వీరయ్య ”. కె ఎస్. రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన శృతి హాసన్ నటిస్తుండగా కేథరిన్ ట్రెసా , బాబీ సింహా , నివేదా పేతురాజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మాస్ మహారాజ్ రవితేజ స్పెషల్ అప్పియరెన్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరో స్పెషల్ ఏంటంటే ఐటెం భామ ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్.
వైజాగ్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమా పక్కా ఊర మాస్ చిత్రమని అంటున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ ను కుమ్మేయడం ఖాయమని ధీమాగా ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2023 జనవరి 13 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
జనవరి 12 న బాలయ్య వీర సింహా రెడ్డి , ఇళయ దళపతి విజయ్ వారసుడు విడుదల అవుతుండగా ఆ మరుసటి రోజున అంటే జనవరి 13 న చిరంజీవి వాల్తేరు వీరయ్య తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే చిరంజీవి లుక్కు అలాగే టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. పైగా మెగాస్టార్ సినిమా కాబట్టి అందునా సంక్రాంతి పండగ కాబట్టి తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భీకరమైన వార్ అనే చెప్పాలి.