యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు షాక్ ఇచ్చారు ఆదిపురుష్ దర్శక నిర్మాతలు. భారీ ఎత్తున రూపొందిన చిత్రం ఆదిపురుష్. కాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రం కావడంతో హిందీ , తెలుగు , తమిళ్ , మలయాళం , కన్నడ భాషల్లో విడుదల కానుంది.
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాకు హిందీలో ప్రభాస్ చేత డబ్బింగ్ చెప్పించకుండా మరో నటుడితో డబ్బింగ్ చెప్పించారట. తెలుగులో ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడు కానీ హిందీకి వచ్చేసరికి హిందీ భాషపై పట్టున్న వాళ్ళు చెబితేనే బాగుంటుందని భావించి శరద్ కేల్కర్ అనే నటుడి చేత డబ్బింగ్ చెప్పించారట. ఈ విషయం డార్లింగ్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
ఈ సినిమాకు గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆ పనులు చేయిస్తున్నారు. వచ్చే ఏడాది ఆదిపురుష్ చిత్రం భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హిందీలో కూడా ప్రభాస్ డబ్బింగ్ చెబితే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఈ సినిమాపై ప్రభాస్ తో పాటుగా ఆయన అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు మరి.