
దర్శకులు మారుతిని బాయ్ కాట్ చేయాలంటూ హంగామా చేస్తున్నారు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ అభిమానులకు దర్శకులు మారుతి మీద కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ……… మారుతి తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్ తో చేయాలని అనుకోవడమే ! ఇటీవల కాలంలో మారుతి దర్శకత్వం వహించిన చిత్రాలు ప్లాప్ అవుతున్నాయి.
దాంతో అతడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ నటించడం ఏంటి ? అతడితో సినిమా చేయొద్దు అంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. బాయ్ కాట్ మారుతి అంటూ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. మారుతి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రభాస్ – మారుతి సినిమా ఆగిపోతుందని కావచ్చు.
అయితే ఈ బాయ్ కాట్ మారుతి అనేది ఎలా ఉన్నప్పటికీ ప్రభాస్ మాత్రం మారుతి తో సినిమా చేయడానికి ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సెట్టింగ్స్ కూడా పూర్తయ్యాయి. దాంతో నవంబర్ నుండి సినిమా స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. బాహుబలి చిత్రాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి పెద్ద దర్శకులతో సినిమాలు చేయాలి కానీ ప్లాప్ దర్శకుడితో సినిమా చేయడం ఏంటి ? అని ఆగ్రహిస్తున్నారు. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ని అనుకుంటున్నారు మారుతి.