రారాజు కృష్ణంరాజు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. హైదరాబాద్ సమీపంలోని కనక మామిడి ఫామ్ హౌజ్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగాయి. ఇక కృష్ణంరాజు పార్దీవ దేహాన్ని ఆయన భార్య శ్యామాలదేవి మోయడం అందరినీ కంటతడి పెట్టించింది. సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం పాడెను మహిళలు మోయరు. కానీ తన భర్త మాత్రమే తనకు సర్వస్వమని భావించిన శ్యామాలదేవి భర్త పాడెను మోసి తన భర్త పట్ల తనకున్న ప్రేమను చాటుకుంది.
ఇక రారాజు కృష్ణంరాజు అంత్యక్రియలకు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, సినీ రంగ ప్రముఖులు , అభిమానులు హాజరయ్యారు. అభిమానుల అశ్రునయనాల మధ్య రారాజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇక ప్రభాస్ కూడా తీవ్ర విషన్న వధనంతో ఉన్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రభాస్ కు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.