ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కు నామినేట్ అయ్యింది ఆర్ ఆర్ ఆర్ చిత్రం. నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ భాషలో బెస్ట్ పిక్చర్ రేసులో ఆర్ ఆర్ ఆర్ నామినేట్ అయ్యింది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ( నాటు నాటు ) రేసులో కూడా ఆర్ ఆర్ ఆర్ నిలిచింది. మొత్తంగా రెండు విభాగాలలో ఆర్ ఆర్ ఆర్ నామినేట్ కావడంతో ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
తాజాగా డార్లింగ్ ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ లో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి , హీరోలు ఎన్టీఆర్ , చరణ్ లపై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ చేసాడు. ఇంకేముంది ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కు ఆర్ ఆర్ ఆర్ నామినేట్ కావడం గర్వంగా ఉందన్నాడు డార్లింగ్ ప్రభాస్.
ఎన్టీఆర్ కొమురం భీం గా చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ చిత్రంలో సీతగా అలియా భట్ నటించగా కీలక పాత్రల్లో అజయ్ దేవ్ గన్ , శ్రియా శరన్ తదితరులు నటించారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం దాదాపు 1200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ఇప్పుడేమో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల రేసులో నిలిచింది. దాంతో తప్పకుండా ఆర్ ఆర్ ఆర్ సంచలనం సృష్టించి భారత పతాకాన్ని రెపరెపలాడించడం ఖాయమని భావిస్తున్నారు.