ఎన్టీఆర్ , రాంచరణ్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్ల వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ , అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటన నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉంది.
అయితే ఆస్కార్ కు పలు కేటగిరీలలో ఈ చిత్రానికి అవకాశం ఉన్నట్లు కనబడుతోంది. వాటిలో ” నాటు నాటు ” అనే పాటకు సంగీతం అందించిన ఎం ఎం కీరవాణి నామినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా ఇదే చిత్రం నుండి మరికొన్ని కేటగిరీలలో పోటీ పడుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి.
వాటిని ఒకసారి పరిశీలిస్తే……
Best Film – RRR
Best Director – SS Rajamouli
Best Actor – Ram Charan
VFX – Srinivas Mohan
Best Screen play – Vijayendra Prasad
మొత్తంగా ఆరు కేటగిరీలలో ఆర్ ఆర్ ఆర్ పోటీ పడుతోంది. దీంట్లో ఏవేని రెండు విభాగాలలో నామినేట్ అవ్వడం ఖాయమని , అలాగే విన్నర్ గా కూడా సత్తా చాటడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం.