
ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఆస్కార్ సాధించిన విషయం తెలిసిందే. ఆస్కార్ వస్తుందని , రావాలని కలలు కన్న రాజమౌళి అందుకోసం గట్టి ప్రయత్నాలే చేసాడు. అంతేకాదు లాస్ ఏంజెల్స్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. గతకొంత కాలంగా అమెరికాకు పదేపదే వెళ్తున్న రాజమౌళి ముందస్తు ప్లాన్ లో భాగంగానే లాస్ ఏంజెల్స్ లో ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు సమాచారం.
నిన్న మొన్నటి వరకు రాజమౌళి క్రేజ్ వేరు ఇప్పటి రాజమౌళి క్రేజ్ వేరు. ఇక నుండి రాజమౌళి చేసే ప్రతీ సినిమా హాలీవుడ్ రేంజ్ లో విడుదల అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా కోసం భారీ ఎత్తున కసరత్తులు జరుగుతున్నాయి. మహేష్ బాబు హాలీవుడ్ హీరోల ఉంటాడన్న విషయం తెలిసిందే. దాంతో రాజమౌళి ఆ చిత్రాన్ని హాలీవుడ్ లో కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.
అందుకోసమే లాస్ ఏంజెల్స్ లో రాజమౌళి పెద్ద ఇంటిని అద్దెకు తీసుకున్నారని తెలుస్తోంది. రాజమౌళి , కీరవాణి కుటుంబం మొత్తం ఆ ఇంట్లోనే ఇన్ని రోజులు ఉన్నారు. త్వరలోనే వాళ్ళు ఇండియాకు రానున్నారట. వచ్చాక పెద్ద ఎత్తున ఆర్ ఆర్ ఆర్ టీమ్ ను అభినందించడానికి పలువురు ప్లాన్ చేస్తున్నారు.