
జబర్దస్త్ లో హాస్య నటుడిగా రాణిస్తున్న ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ప్రవీణ్ తండ్రి అనారోగ్యంతో మరణించాడు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు ప్రవీణ్ తండ్రి. దాంతో ఆపరేషన్ నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించాడు ప్రవీణ్. అయితే ఆపరేషన్ చేస్తున్న సమయంలో వెన్నుపూసలోకి నీరు చేరడంతో పరిస్థితి విషమించింది. దాంతో ప్రవీణ్ తండ్రి మరణించాడు. తండ్రి మరణంతో ప్రవీణ్ తీవ్ర దుఃఖసాగరంలో మునిగాడు. ప్రవీణ్ తల్లి చిన్నప్పుడే చనిపోయింది దాంతో తండ్రి అంటే ఎనలేని ప్రేమ ప్రవీణ్ కు. ఇక ఇపుడేమో తండ్రి కూడా మరణించడంతో ప్రవీణ్ ని చూసి చలించిపోతున్నారు.