
TSPSC ( తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ) ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడైన ప్రవీణ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారించగా పలు షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రవీణ్ సెల్ ఫోన్ ని పరిశీలించగా అందులో పెద్ద సంఖ్యలో మహిళల నగ్న చిత్రాలు ఉండటం పోలీసులను కలవరపాటుకు గురి చేసాయి.
మహిళలతో సన్నిహితంగా ఉంటూ వాళ్ళను శారీరకంగా కూడా లోబరుచుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి కావడం సంచలనంగా మారింది. పలువురు మహిళల నగ్న చిత్రాలు ప్రవీణ్ ఫోన్ లో ఉన్నట్లు గుర్తించారు. వాళ్లతో అసభ్యకరమైన సంభాషణ కూడా కొనసాగించినట్లు వాట్సాప్ చాట్ చూస్తుంటే అర్ధమవుతోంది.
2017 లో TSPSC లో జూనియర్ అసిస్టెంట్ గా చేరిన ప్రవీణ్ అక్కడకు వచ్చే మహిళలతో పరిచయం పెంచుకొని మొబైల్ నెంబర్ తీసుకొని మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి లోబరుచుకున్నట్లు విచారణలో వెల్లడించాడు. ఇక ఇప్పటి ప్రశ్నాపత్రం విషయానికి వస్తే రేణుక అనే మహిళకు ప్రశ్నాపత్రం లీక్ చేసి ఇచ్చాడు. ఆ పేపర్ ను రేణుక సోదరుడు అమ్మకానికి పెట్టడంతో ఇంతటి రచ్చ అయ్యింది.